Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు…

0
gold thumb

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

హైదరాబాద్: బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట కలిగించేలా బులియన్ మార్కెట్లో ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు గణనీయంగా తగ్గగా.. ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు ఒక్కరోజే కిలోకు రూ.10 వేల మేర దిగివచ్చాయి. వరుసగా తగ్గుతున్న ధరలతో కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,38,880కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,27,300గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు మరింత భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర శుక్రవారం ఒక్కరోజే రూ.10,000 తగ్గి రూ.1,90,200కు చేరింది. దీంతో వెండి ధరలు గత 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నెలలో ఇప్పటివరకు కిలో వెండి ధర మొత్తం రూ.45 వేల మేర తగ్గడం గమనార్హం.

గతేడాది డిసెంబర్ 10న కిలో వెండి ధర రూ.1.92 లక్షలుగా నమోదైంది. ప్రస్తుతం ధరలు ఆ స్థాయికి దిగువకు చేరడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కిలో వెండి ధర రూ.4 లక్షల స్థాయిని తాకిన నేపథ్యంలో తాజా పతనం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.

ధరలు మరింత తగ్గుతాయా? లేక మళ్లీ పుంజుకుంటాయా? అన్న ఆసక్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో నెలకొంది.

#GoldRateToday #SilverRateToday #GoldPrice #SilverPrice #GoldCrash #SilverCrash #GoldNews #SilverNews #HyderabadGoldRate #BullionMarket #BusinessNews #TeluguNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply