Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

ANU లో 12 మంది CAS ప్రొఫెసర్లకు ప్రభుత్వ మెమోతో గట్టి ఎదురుదెబ్బ

0
WhatsApp Image 2026-10-31 at 9.10.50 AM

GEE TV కథనం అక్షర సత్యం.. మరోసారి నిరూపితమైన ప్రభుత్వ మార్గదర్శకాలు
అర్హత తేదీ కాదు.. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఆర్థిక ప్రయోజనాలు
గతంలోనే స్పష్టత ఉన్నా.. మళ్లీ మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

పరశురాం పచ్చవ | బ్యూరో చీఫ్|GEETV

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 12 మంది అధ్యాపకుల CAS ప్రొఫెసర్ పదోన్నతుల వ్యవహారంపై GEE TV గతంలో ప్రచురించిన కథనాలకు తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన మెమో మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. CAS పదోన్నతులు, నాలుగేళ్ల సర్వీసు క్లబ్బింగ్, అర్హత తేదీల సవరణ, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలపై GEE TV గత నెలలోనే కథనం ప్రచురించి పలు అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ అక్టోబర్ 28, 2026న జారీ చేసిన మెమోతో CAS కింద పదోన్నతి పొందిన అధ్యాపకులకు ఆర్థిక ప్రయోజనాలు ఏ తేదీ నుంచి వర్తించాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో GEE TV గతంలో లేవనెత్తిన అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

12 మంది కోసం అర్హత తేదీల సవరణ.. 2024లో ప్రత్యేక ప్రొసీడింగ్స్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 12 మంది అధ్యాపకులకు సంబంధించిన CAS ప్రొఫెసర్ పదోన్నతుల వ్యవహారంలో 2024 సెప్టెంబర్ 23న వైస్‌ఛాన్సలర్ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. అప్పటి రిజిస్ట్రార్ ఇన్‌ఛార్జి ప్రొఫెసర్ జి. సింహాచలం పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల్లో 12 మంది అధ్యాపకుల ప్రొఫెసర్ పదోన్నతికి సంబంధించిన అర్హత తేదీలను సవరించినట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఇచ్చిన వివరణ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి లేఖ, వైస్‌ఛాన్సలర్ ఆదేశాలు, కమిటీ సమావేశపు మినిట్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఈ ప్రొసీడింగ్స్‌లో అధ్యాపకుల సర్వీసు వివరాలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన తేదీ, నాలుగేళ్ల క్లబ్బింగ్ సర్వీసు అనంతరం పరిగణించిన తేదీ, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన తేదీ, ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన తేదీ, ప్రొఫెసర్ పదోన్నతికి సవరించిన అర్హత తేదీలను పొందుపరిచారు. వివిధ విభాగాలకు చెందిన ఈ 12 మంది అధ్యాపకుల అర్హత తేదీలను 2017 అక్టోబర్ నాటికి చూపిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయడం అప్పట్లోనే పలు విమర్శలకు దారితీసింది.


నాలుగేళ్ల క్లబ్బింగ్ సర్వీసుపై GEE TV ముందస్తు కథనం ప్రచురించింది.

CAS పదోన్నతుల విషయంలో నాలుగేళ్ల సర్వీసు క్లబ్బింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం, దాని ఆధారంగా అర్హత తేదీలను నిర్ణయించడం వంటి అంశాలపై GEE TV గతంలోనే ప్రభుత్వ నిబంధనలను ప్రస్తావిస్తూ కథనాలు ప్రచురించింది. విశ్వవిద్యాలయంలో కొంతమంది అధ్యాపకుల పదోన్నతుల కోసం నిబంధనలను ఎలా అన్వయించారు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ సాగిందా అనే అంశాలను ప్రశ్నించింది. CAS విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టమైన విధానం ఉందని, విశ్వవిద్యాలయాలు తమకు అనుకూలంగా నిబంధనలను అన్వయించుకోవడానికి వీల్లేదని GEE TV తన కథనంలో స్పష్టం చేసింది.

తాజాగా జారీ అయిన ప్రభుత్వ మెమోలో కూడా గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మరోసారి ఆదేశించడం GEE TV గతంలో ప్రస్తావించిన అంశాలకు ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
2022, 2023లోనే ప్రభుత్వ స్పష్టీకరణ.. అయినా మళ్లీ అదే అంశంపై మెమో

పై ఫోటో నాలుగేళ్ల క్లబ్ సర్వీస్ పై జి టివి ముందస్తు కథనం చేసిన చిత్రం

CAS పదోన్నతుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకున్నది కాదు. 2022 అక్టోబర్ 6, 2023 ఏప్రిల్ 27 తేదీల్లోనే ఉన్నత విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధ్యాపకులకు ఆర్థిక ప్రయోజనాలు వారు పదోన్నతి పొందిన పోస్టులో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే వర్తిస్తాయని అప్పుడే ప్రభుత్వం పేర్కొంది. అర్హత తేదీ లేదా ఇంటర్వ్యూ తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు కల్పించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈ మార్గదర్శకాలను ఎలాంటి సందేహాలకు, అపార్థాలకు తావులేకుండా కచ్చితంగా అమలు చేయాలని కూడా ఆదేశించింది. అయినప్పటికీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ 2026 సెప్టెంబర్ 15, అక్టోబర్ 8 తేదీల్లో మరోసారి ప్రభుత్వాన్ని వివరణ కోరడం గమనార్హం.

తాజా మెమోతో ప్రభుత్వ వైఖరి మరోసారి స్పష్టం

ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ అక్టోబర్ 28, 2026న మెమో నంబర్ 3426491/UE/A1/2026 జారీ చేసింది. CAS కింద పదోన్నతి పొందిన అధ్యాపకులకు ఆర్థిక ప్రయోజనాలు పదోన్నతి పొందిన పోస్టులో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఇవ్వాలని మరోసారి తేల్చిచెప్పింది. అర్హత సాధించిన తేదీ నుంచి కానీ, ఇంటర్వ్యూ తేదీ నుంచి కానీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలోనే జారీ చేసిన 2023 ఏప్రిల్ 27 నాటి ప్రభుత్వ స్పష్టీకరణను యథాతథంగా పాటించాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని మెమో ప్రతులను పంపించింది.

GEE TV ముందుగానే చెప్పింది.. ఇప్పుడు ప్రభుత్వ మెమో అదే అంశాన్ని మరోసారి స్పష్టం చేసింది

ANUలో CAS పదోన్నతుల వ్యవహారంపై GEE TV గతంలోనే ప్రభుత్వ నిబంధనలు, నాలుగేళ్ల క్లబ్బింగ్ సర్వీసు, అర్హత తేదీల సవరణ అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు ప్రచురించింది. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ తాజా మెమో ద్వారా ఆర్థిక ప్రయోజనాల విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. అర్హత తేదీ ఎంత వెనక్కి ఉన్నా, పదోన్నతి పొందిన పోస్టులో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయన్న ప్రభుత్వ ఆదేశం ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశంగా నిలిచింది. విశ్వవిద్యాలయాల్లో పదవులు, పదోన్నతులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నిబంధనల ప్రకారం జరగాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ఎవరూ అతీతులు కాదన్న విషయాన్ని ఈ మెమో మరోసారి గుర్తుచేసింది. ANUలో 12 మంది అధ్యాపకుల CAS పదోన్నతుల వ్యవహారంలోనూ ప్రభుత్వ మార్గదర్శకాలు ఏ మేరకు అమలయ్యాయో పూర్తి రికార్డుల పరిశీలనతో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది.

#GEETV #GEETVNews #ANU #AcharyaNagarjunaUniversity #CASPromotions #CASProfessors #12Professors #HigherEducation #APGovernment #GovernmentMemo #APEducationNews #UniversityNews #ProfessorPromotions #AndhraPradeshNews #TeluguNews #GunturNews #EducationDepartment

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply