మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – ANUలో ఘనంగా నషా ముక్త్ భారత్ ర్యాలీ
పరశురాం పచ్చవ || GEETV
గుంటూరు: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హైదరాబాద్ ప్రాంతీయ జాతీయ సేవా పథకం (NSS) డైరెక్టర్ ఆర్. సైదా గారి ఆదేశాల మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (NSS) విభాగం ఆధ్వర్యంలో నేడు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు ముఖ్య అతిథిగా, NSS సమన్వయకర్త ప్రొఫెసర్ వి. దివ్యజ్యోర్మూర్తి అధ్యక్షత వహించగా, రాష్ట్ర NSS అధికారి డాక్టర్ ఎం. సుధాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్. శివరామ ప్రసాద్, కార్యనిర్వాహక మండలి సభ్యుడు ప్రొఫెసర్ త్రిమూర్తి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు (CDC)తో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, ప్రొఫెసర్ పి.పి. సత్యపాల్ కుమార్, ప్రొఫెసర్ కె. తేజోమూర్తి, ప్రొఫెసర్ ఎన్. నిరుపమ, డాక్టర్ వై. సునీత తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ తదితర విభాగాలకు చెందిన సుమారు l 400 మంది విద్యార్థులు, అధ్యాపకులు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఘlన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, అతిథులందరూ కలిసి నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు ఇతరులకు కూడా వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తామని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సామాజిక విలువలకు, దేశ భవిష్యత్తుకు కూడా తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా విద్య, క్రీడలు, సృజనాత్మకత, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, దేశ అభివృద్ధిలో 3భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా NSS అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమంతో పూర్తయ్యే విషయం కాదని, ప్రతి ఒక్కరూ నిరంతరం బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. విద్యార్థులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతరులకు అవగాహన కల్పిస్తూ మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైస్ ఛాన్సలర్, ఇతర ప్రముఖులు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వివిధ విభాగాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వైపు కదం తొక్కారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువత బాధ్యత, మాదకద్రవ్యాల నిర్మూలన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ర్యాలీ విజయవంతంగా సాగింది.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పి. సత్యపాల్ కుమార్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. తేజోమూర్తి, కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిరుపమ, డాక్టర్ వై. సునీత తదితరులు పాల్గొన్నారు.
NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు Ch. రవికుమార్, ఉమాశంకర్, యుగేందర్, శ్రీనివాస్, వెంకటేష్ ప్రసాద్, నిరుపమ, సుజన, ఏ.జె.వి. రాధిక, వై. సునీత, డి. సుమలత తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొని తమ సహకారాన్ని అందించారు.
మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పడం అంటే జీవితానికి ‘యెస్’ చెప్పడమే! యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాల వ్యతిరేక రాయబారిగా మారి, తన పరిసరాల్లో అవగాహన కల్పించినప్పుడే నషా ముక్త్ భారత్ లక్ష్యం సాకారమవుతుంది. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ NSS విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యాన్ని పెంపొందించింది.
#ANU #AcharyaNagarjunaUniversity #NSS #NashaMuktBharat #DrugFreeIndia #DrugFreeSociety #AntiDrugAwareness #SayNoToDrugs #YouthAwareness #StudentRally #NSSActivities #GunturNews #AndhraPradeshNews #UniversityNews #YouthEmpowerment #మాదకద్రవ్యాలనిర్మూలన #నషాముక్త్భారత్ #మత్తుపదార్థాలకుదూరంగా #GEETVNEWS