చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్లకు ఆశీర్వాదం
చెన్నై: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులు శ్రేయ–ఉజ్వల్లను ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్ విజయమ్మతో పాటు పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ప్రముఖుల రాకతో చెన్నైలోని లీలా ప్యాలెస్ వివాహ వేడుక సందడిగా సాగింది. నూతన వధూవరులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
#YSJagan #YSBharathi #Chennai #WeddingCelebration #JosephVijay #GautamAdani #KTR #YSVijayamma #GEETVNews