కరోనా సోకకుండా ఉండాలంటే తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇలా పరిశుభ్రత పాటించడం అందరికీ సాధ్యమేనా? ఆ వెసులుబాటు అందరికీ ఉంటుందా? అనే కోణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ/యునిసెఫ్‌ నిర్వహించిన ప్రపంచవ్యాప్త సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

300కోట్ల మంది ప్రజల ఇళ్లలో నీళ్లు, సబ్బు వాడే వెసులుబాట్లు లేవు.

90 కోట్ల మంది పిల్లలకు వారి స్కూళ్లల్లో నీళ్లు, సబ్బులు అందుబాటులో లేవు.

36శాతం పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు అందుబాటులో లేవు.

40శాతంఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో చేతుల శుభ్రత వెసులుబాట్లు లేవు.

సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవడం మూలంగా ప్రతి ఏటా సుమారు 3 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాప్తికి ముందు సంభవించిన ఈ మరణాల్లో అధికశాతం పిల్లలవే!