న్యూఢిల్లీ: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? అయితే ఇప్పుడు ఒక పాము అరచేతి నుంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ అరుదైన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుశాంత నందా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో పాము మనిషి అరచేతిలోని నీటిని నాలుకతో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

 

అది సాధ్యం కాకపోవడంతో రెండు దవడలపై కొంచెం ప్రతికూల ఒత్తిడిని కలిగించి నీటిని తీసుకుంటుంది. ఆ వెంటనే నోటిని మూసివేసి సానుకూల ఒత్తిడిని సృష్టించుకొని నీటిని శరీరంలోకి పంపుతుంది’ అంటూ వ్యాఖ్యానిస్తూ నందా ట్వీట్‌ చేశారు. కాగా.. ముద్దుగా, మురిపెంగా పాము నీటిని తాగుతూ గుటకలేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.