న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ21ఎస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా క్వాడ్-కెమెరా రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ లాంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

గెలాక్సీ ఏ 21ఎస్ ఫీచర్లు
6.50 అంగుళాల డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10
720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
48+ 8+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ధరలు:
4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 16499 రూపాయలు
6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 18499 రూపాయలు.
బ్లాక్, బ్లూ , వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్, ఇతర ప్రధాన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ఈ రోజు (బుధవారం) నుండి లభ్యం.