టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ఒకరు రానా దగ్గుబాటికి మిహిక బజాజ్ ఎస్ చెప్పింది అంటూ రానా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దీనితో సోషల్ మీడియా లో రానా బాచిలర్ లైఫ్ కి బాయ్ చెప్పాడంటూ చాల ట్రోల్స్ దర్శనమిచ్చాయి. దాని తరువాత వెంటనే రానా ,మిహిక ల రోక ఫంక్షన్ కూడా జరిగింది. రానా, మిహిక బజాజ్ ప్రి వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు. అయితే ప్రి వెడ్డింగ్ షూట్ లో తన తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు మిహిక బజాజ్.ఆ ఫోటోలు, వివరాలేంటో చూసెయ్యండి.

తదుపరి రానా పెళ్లిని భారీ స్థాయిలో చేయాలని సురేష్ బాబు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోని మ్యారేజ్ నిర్వహించేందుకు సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రానా ,మిహిక ల వివాహం ఆగస్టు 8 వ జరగనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.