Bureau of outreach and communication

మధ్యంతర ఎంపానెల్‌మెంట్‌కు నోటిఫికేషన్

న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DAVP (DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY). ప్రస్తుతం BOC (Bureau of Outreach and Communication)గా పేరుమార్చుకున్నప్పటికీ నేటికీ ‘డీఏవీపీ’గానే ప్రాచుర్యంలో ఉంది. ప్రింట్ మీడియా ఎంపానెల్‌మెంట్‌ తరహాలోనే ఈ సంస్థ ఇంటర్నెట్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను కూడా గుర్తిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ‘న్యూ మీడియా’ పేరిట దీని కోసం ప్రత్యేక నిబంధనలతో కూడిన విధానాన్ని కూడా అమలుచేస్తోంది.

ఇప్పటికే పలుమార్లు వెబ్‌సైట్ల ఎంపానెల్‌మెంట్‌ కోసం అవకాశం కల్పించిన డీఏవీపీ తాజాగా మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వెబ్ ప్రచురణకర్తలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులు రేపటిలోగా తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంది. 2016 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చిన సవరించిన ‘The Print Media Advertisement Policy of the Government of India – 2016’ ప్రకారం ఏడాదికి రెండుసార్లు వార్తా పత్రికల ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల రీత్యా గత మూడు పర్యాయాలుగా ఈ విధానం తాత్కాలికంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే, ప్రింట్ మీడియా తరహాలో ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌తో కూడిన ప్రకటన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి పరిశీలించడచ్చు. ఎంపానెల్‌మెంట్‌ (Empanelment) కోసం ఏ విధంగా దరఖాస్తుచేయాలి? విధివిధానాలను ఔత్సాహిక వెబ్ ప్రచురణకర్తలు తెలుసుకుని దరఖాస్తుచేసుకోవచ్చు.

పైన ఇచ్చిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా BOC గత పక్షం రోజుల కిందట జారీచేసిన ఉత్తర్వులను కూడా పరిశీలించవచ్చు. కమిట్‌మెంట్, డెడికేషన్‌తో వెబ్‌సైట్‌లు/ఛానళ్లు నిర్వహించే ఔత్సాహిక ప్రచురణకర్తలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరమనే చెప్పాలి. వాణిజ్య బిడ్ (Commercial bid), ఆర్థిక బిడ్ (Financial bid)ను వేర్వేరుగా సమర్పించాల్సి ఉంటుంది.