మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నిహారిక పెళ్లి వార్తలపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆమె చేసిన పోస్ట్‌లో.. ఓ కాఫీ కప్‌పై ‘మిస్‌ నిహారిక’ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మిస్‌ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్‌ అని రాసి పక్కన క్వశ్చన్‌ మార్క్‌ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. ఈ పోస్ట్‌ క్షణాల్లోనే తెగ వైరల్‌ అయింది.

పెళ్లి గురించి నిహారిక హింట్‌ ఇచ్చింది అని నెటిజన్లు పేర్కొంటుండగా మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్‌కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. వై అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి గురించి అనేక రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వచ్చాయి. అయితే నిహారిక పోస్టుపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.