అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యూమెంట్స్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్‌ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

అంతేగాక మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన చవ్వా గోపాల్‌రెడ్డిని 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించేందుకు కూడా కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు చవ్వా గోపాల్‌రెడ్డి ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు.