‘కొవిడ్‌-19’ నియంత్రణలో భాగంగా ఇంట్లో స్వీయనిర్బంధం (సెల్ఫ్‌-క్వారంటైన్‌)లో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌ కోల్పోకుండా ఎలా ఉంచుకోవాలో సెలబ్రిటీ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచీవాలా కొన్ని చిట్కాలు చెప్పారు. అవేమిటంటే…

కదలికలు తప్పనిసరి. అంటే వాకింగ్‌, రన్నింగ్‌ లాంటివి.

రోజుకు రెండు పర్యాయాలు వర్కవుట్లు తప్పనిసరిగా చేయాలి.

పోషకాహార విలువలతో కూడిన ఆహారం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి.

వ్యాయామాలు చేయాలి. కానీ అవి శరీరానికి సరికొత్త శక్తినిచ్చేలా ఉండాలి.

మీరు తీసుకునే ఆహారంలో దాల్చినచెక్క, అల్లం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు, సమోసాలు లాంటివి తినొద్దు. వీటివల్ల శరీర బరువు పెరుగుతుంది. అందుకే రోటీ, కూర, పప్పు, కాయగూరలు, పండ్లు లాంటివి తింటే మంచిది.

వైరస్‌ వ్యాప్తి బాగా ఉన్న ఈ టైములో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ప్రభుత్వం సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటిస్తే కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలం.

ఈ సమయంలో ముఖ్యంగా కావాల్సింది ధైర్యం. భయపడకుండా పాజిటివ్‌గా ఆలోచించాలి.

భౌతిక దూరం పాటించాలి. చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. సెల్ఫ్‌-కార్వరంటైన్‌లో లేనివారు కూడా ఇంట్లోనే ఉండాలి.

క్వారంటైన్‌లో ఉండడటమంటే వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం.

విశ్రాంతి బాగా తీసుకోవాలి.

ఆహారం, వ్యాయామాలు ప్రణాళికాబద్ధంగా చేస్తే శరీరం ఉల్లాసంగా ఉంటుంది.