ఆసియా ఖండంలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తోందా. సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోందా. తాజా పరిస్తితులు చూస్తే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఓవైపు మన దేశాన్ని కవ్విస్తున్న చైనా, అటు సరిహద్దు దేశాల్లో కూడా అలజడి రేపుతోంది.

భారత్, చైనా ఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక్క మన దేశాన్నే కాదు ఆసియాలోని పలు దేశాలతో చైనా తీరు ఇలాగే ఉంది. ముఖ్యంగా హాంగ్ కాంగ్, తైవాన్, వియత్నాం, జపాన్ దేశాలతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది.

దాదాపు పది రోజుల క్రితం చైనా యుద్ధ విమానాలు తైవాన్ భూభాగంలోకి చొరబడ్డాయి. జూన్ 10వ తేదీన జే-10 చైనా యుద్ధ విమానం తమ భూభాగంలోకి చొరబడటంతో తైవాన్ దాన్ని తరిమికొట్టింది. అలాగే జూన్ 12వ తేదీన చైనాకు చెందిన సు-30 జెట్ ఫైటర్స్ కు తైవాన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో చైనాకు తైవాన్ పరమ శత్రువుగా మారిది.Chaina War Aeroplanesఇక జపాన్ ను వదల్లేదు. ఈ ఏడాది ఏప్రియల్ లో జపాన్ కు చెందిన ఒకినావ, మియాకో ద్వీపాల మధ్య చైనా యుద్ధ విమానం చక్కర్లు కొట్టింది. జపాన్ ఫైటర్ జెట్స్ చైనా యుద్ధ విమానాన్ని వెంటాడాయి.

అలాగే ఏప్రియల్ రెండో వారంలో చైనా సముద్రంలో వార్ డ్రిల్ నిర్వహించిన చైనా నేవీ, మలేషియా ఆయిల్ కంపెనీల గగనతలంలో యుద్ధ విమానంతో పరిసరాలను వీడియో తీయించింది. దీంతో బెంబేలెత్తిన మలేషియా సాయం కోసం అమెరికా వెంట పడుతోంది.

అలాగే సౌత్ చైనా సముద్రంలోని పార్సిల్ ద్వీపాల దగ్గర వియత్నాంకు చెందిన చేపల బోట్లపై చైనా నేవీ దాడులు చేసింది. కొందరిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టింది. ఈ ఏడాది కాలంలో ఇలాంటి దాడులకు పలుమార్లు తెగబడింది చైనా.

అలాగే ఈ ఏడాది ఏప్రియల్లో సౌత్ చైనా సముద్రంలో అమెరికా, చైనా నేవీ అధికారుల మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. దీంతో రెండు దేశాల యుద్ధనౌకలు వంద మీటర్ల పరిధిలో ఎదురు ఎదురుగా వచ్చాయి. ఆ తర్వాత పరిస్తితి సర్దు మణిగింది.

ఓవైపు కరోనా, మరోవైపు చైనా నేవీ చేస్తున్న విన్యాసాలతో భయపడిన ఫిలిప్పైన్స్, పది రోజుల క్రితం ఏకంగా అమెరికాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తేంటే చైనా కేవలం భారతదేశాన్నే కాదు, కొన్ని ఆసియా దేశాలకు కంటగింపుగా మారినట్లు అర్థం అవుతోంది.

చైనా వ్యూహం ఏంటి …

ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైనా, అసలు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఆసియా దేశాలను ఎందుకు ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ డ్రాగెన్ కంట్రీ వ్యూహం ఏంటి.

హిందూ మహా సముద్రంపై పట్టు కోసం చైనా కొన్ని సంవత్సరాలుగా ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా సముద్ర తీరం ఉన్న ఆసియా దేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రలో భాగంగా కొన్ని దేశాలకు షరతులతో కూడిన ఆర్థికంగా సాయం చేసి తనవైపు తిప్పుకున్న చైనా, కొన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. తన వ్యూహంలో భాగంగానే శ్రీలంకలోని హంబన్ టోటా రేపుపై పట్టు సాధించేందుకు లంక ప్రభుత్వానికి భారీ ప్యాకేజ్ ఇచ్చింది.

ఆ డబ్బుతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా ప్లాన్ చేసింది. చైనా పన్నాగం తెలిసినా డబ్బుకు ఆశ పడ్డ శ్రీలంక హంబన్ టోటా రేవును 99 సంవత్సరాల పాటు చైనా కంపెనీకి లీజుకు ఇచ్చింది. అంతేకాదు, మయన్మార్, మలేషియా, థాయ్ ల్యాండ్ దేశాల్లో కూడా చైనా భారీగాపెట్టుబడులు పెట్టి తన పబ్బం గడుపుకుంది. అలాగే ఎకనామిక్ కారిడార్ పేరుతో పాకిస్తాన్ పాలకులకు డబ్బు బిస్కెట్లు వేసింది డ్రాగెన్ దేశం.

ఈ పన్నాగం ద్వారా హిందూ మహా సముద్రంలో జరిగే వ్యాపారంలో 80 శాతం తన కనుసన్నలలో నడిచే విధంగా పట్టు సాధించాలన్నదే చైనా పాలకుల వ్యూహం. అందుకే ఈ కుట్రకు ఈ వ్యూహానికి మలక్కా డైలమా పేరు పెట్టారు చైనా పాలకులు. మలక్కా, లాంబక్, సుండా జలసంధుల చెక్ పాయింట్స్ నుంచి జరిగే వ్యాపారం కనుకే ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే తూర్పు తీరంతో పాటు అండమాన్ నికోబార్ ద్వీపాల్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ ద్వారా భారత నావికా దళం చైనా కుట్రను సమర్థవంతంగా అడ్డుకుంటోంది. అంటే రేవు పట్టణాలు, సముద్ర స్థావరాల కోసం చైనా వెంపర్లాడుతోంది. ఇప్పటికే మయన్మార్ లోని చాక్ ప్యూ రేపుతో పాటు, పాకిస్తాన్ లోని గ్వాదర్ రేవులను స్థావరాలుగా చేసుకున్న, కొత్త వాటికోసం పాట్లు పడుతోంది. తన వ్యూహాలను అడ్డుకుంటున్న భారతదేశం మీద చైనా అందుకే కసి పెంచుకుంది.

ఇప్పుడు ఇండియా ఏం చేయాలి …

చైనా కుట్రలకు చెక్ పెట్టాలంటే మనదేశం ఏం చేయాలి. ఎలాంటి వ్యూహాలు పన్నాలి. హిందూ మహాసముద్రంలో చైనాకు పట్టు దొరక్కుండా, మనం బలపడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.కాంగ్రెస్ పాలకుల చేతకాని తనంతో ఇప్పటికిప్పుడు చైనా ఆటకు ర్తి స్తాయిలో చెక్ పెట్టడం కష్టతరమే అయినా, సగానికి సగం తగ్గించే అవకాశం కచ్చితంగా ఉంది. ఆసియాలోని తీర ప్రాంత దేశాలు జట్టుగా ఏర్పడి చైనాను అడ్డుకోవాలి. అలాగే ఒమన్ లోని దుకమ్, ఆఫ్రికా జిబుతిలోని ఫ్రాన్స్ బేస్ హెరాన్, సీషెల్స్, మాల్దీవులు, శ్రీలంకలోని ట్రింకోమలి ప్రాంతాల్లో ఉన్న మన ఆర్మీ క్యాంపులను మరింత బలోపేతం చేయడంతో పాటు, కొత్త చోట్ల క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇప్పటికే వియత్నాం ఓడ రేవులో నావిక దళ స్థావరం ఏర్పాటు చేసిన భారత్, అక్కడ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ స్టేషన్ నడుపుతోంది. దీని ద్వారా హైనాన్ ద్వీపంలోని చౌైనా యుద్ధ, వ్యాపార నౌకల కదలికలను గుర్తిస్తోంది ఇండియన్ నేవీ. అలాగే మలక్కా, లాంబక్, సుండా జల సంధుల్లో ఎంత బలం పెంచుకున్న భారత నౌకా బలం ముందు చైనా తేలిపోతోంది. ఈ విషయం ఆ దేశానికి చాలా స్పష్టంగా తెలుసు.

ఇక వియత్నాంకు బ్రహ్మాస్ వంటి క్రూయిజ్ మిసైళ్లను భారీగా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో దక్షిణ చైనా సముద్రంలోని చైనా మూడు సైనిక స్థావరాలతో పాటు, హిందూ మహా సముద్రంలో చైనా సైనికులకు కళ్లెం వేయవచ్చు. అంటే ముందు ముందు చైనాను వ్యతిరేకిస్తున్న దేశాల్లో మనదేశం మీద నమ్మకం పెరుగుతుంది. చైనాను ఎదుర్కోగలమన్న ఆత్మ విశ్వాసం ఆ దేశాల్లో పెరుగటం ఖాయం.

మరో విషయం ఏంటంటే, యాభై ఏళ్ల తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కల్పనలో సతమతం అవుతోంది. ఇదే సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్తితి నెలకొంది. పార్టీ ఆలోచన, ఆచరణలో భారీగా మార్పులు రావాలని యువనేతలు పట్టుపడుతున్నారు. దీంతో సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిస్తితుల అవకాశంగా తీసుకుంటే చైనా స్వదేశంలోనే నొక్కే అవకాశం ఉంటుంది.

ఇప్పటి దాకా మోడీ ఏం చేశారు …

ఇప్పుడు చైనాకు ప్రధాని నరేంద్ర మోడీ ఎలా గుణపాఠం చెప్పబోతున్నారు. మోడీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి. మన దేశంతో నేరుగా యుద్ధానికి దిగే దమ్ము ఇప్పుడు చైనాకు ఉందా. సగటు భారతీయుడిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.

Sri Narendra Modi

ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చైనా మన చెలరేగిపోయింది. నాటి కాంగ్రెస్ పాలకులు కూడా చేష్టలుడికి చూడటం మినహా చేసింది ఏమీ లేదు. కరవకపోయినా, కనీసం చైనా మీద బుసకొట్టే ధైర్యం కూడా లేకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ పాలకులతో కలిసి డ్రాగెన్ కంట్రీ విచ్చల విడిగా ప్రవర్తించింది. నాటి నెహ్రూ నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ దాకా కాంగ్రెస్ పాలకుల తీరు మారలేదు. కానీ 2014 తర్వాత చైనా పాలకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయి.

మొదటి నుంచీ దేశ రక్షణ విషయంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటగా సైనికులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. పరిస్తితికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం త్రివిధ దళాధిపతులకు, సరిహద్దులోని అధికారులు ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి చెక్ పడింది. అలాగే చైనా ఓవర్ యాక్షన్ తగ్గింది. ఇదే సమయంలో మోడీ కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.మరో విషయం ఏంటంటే, మోడీ ప్రధాని అయినప్పటి నుంచీ చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలతో స్నేహం పెంచుకునే వాతావరణం సృష్టించారు. ఇప్పుడు మోడీ చేసిన ఆరేళ్ల కృషి అక్కరకు వచ్చింది. ప్రధానంగా రష్యా, మంగోలియా, కజికిస్థాన్, కిర్గిస్థాన్, తైవాన్, జపాన్, థాయ్ ల్యాండ్, దక్షిణ కొరియాలతో దౌత్య సంబంధాలు పటిష్టం చేశారు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. గత ప్రధానులు ఈ దేశాలతో మాట్లాడినా, దౌత్య సంబంధాలు నడిపినా, మంగోలియాను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ మోడీ ప్రధాన దృష్టి మొత్తం మంగోలియా మీదే పెట్టారు.modi mongolia visitప్రధాని మోడీ మంగోలియానే ప్రధానంగా ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఏంటంటే, ఆ దేశ భౌగోళిక స్వరూపం మొదటిదైతే, మంగోలులు అంటే చైనీయులకు మొదటి నుంచీ భయం ఉండటం రెండో ప్రధాన అంశం. వారి దాడి నుంచి తట్టుకునేందుకే చైనా గోడ కట్టింది. మంగోలియా చైనాలో చొచ్చుకుని వచ్చినట్లు ఉంటుంది. అక్కడ నుంచి బీజింగ్ ను కొట్టడం చాలా తేలిక. అందుకే మోడీ వ్యూహాత్మకంగా మంగోలియాను ఎంచుకున్నారు.

గతేడాది సెప్టెంబర్ లో మోడీ మంగోలియాలో పర్యటించారు. పేదరికంలో మగ్గుతున్న ఆ దేశానికి 6 వేల 300 కోట్ల రూపాయల సాయం అందించారు. పౌర, అణు ఇంధన రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగోలియాలో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా పేరు తెచ్చుకున్న మోడీ, చైనా నుంచే మంగోలియాకు వెళ్లడం డ్రాగెన్ కంట్రీకి మింగుడు పడలేదు. ఎందుకంటే మంగోలియా ఆర్థికంగా బలపడటం చైనాకు ఏమాత్రం రుచించదు. అంతేకాదు, తమ ఎయిర్ బేస్ వాడుకునే అవకాశం భారతదేశానికి, మంగోలియా ఇవ్వడం చైనాకు ఏమాత్రం రుచించడం లేదు.

మరో విషయం ఏంటంటే, మనకంటే చైనా సైనిక, ఆయుధ శక్తి చాలా ఎక్కువ. అందుకే ఆ దేశంతో యుద్ధానికి దిగితే ఓటమి ఖాయమని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్తితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే, భారత్, చైనా యుద్ధం మొదలైతే అది కచ్చితంగా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ముఖ్యంగా ఈ పరిణామంతో దారుణ పరాభవం ఎదుర్కొనేది చైనా మాత్రమే. ఎందుకంటే, సరిహద్దు దేశాల్లో తొంభై శాతం చైనాకు శత్రువులే. మనకు మిత్రులే. అంటే మన మీద చైనా దాడి మొదలు పెడితే అటు జపాన్, ఇటు మంగోలియా సైన్యాలు మొదటగా చైనా మీద విరుచుకు పడతాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

ఇదే సమయంలో వియత్నాం, సౌత్ కొరియాలు మనతో జతకట్టడం ఖాయం. ఇక అమెరికా, ఆస్ట్రేలియాలు మొదటి నుంచీ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నాయి. కరోనా వైరస్ కారణంతో ప్రపంచానికి శత్రువుగా మారింది చైనా. ఇలాంటి పరిస్తితుల్లో తన దేశ సరిహద్దులో ఉన్న దేశాలు ఒకేసారి యుద్ధానికి దిగితే చైనా పరిస్తితి ఏంటో ఇట్టే అర్థం అవుతోంది. అంటే సైన్యాన్ని విడిదీయాలి, ఆయుధాలను వేర్వేరు ప్రాంతాలకు పంపాలి. భారత్, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే బలమైన క్షిపణి దాడులను కాచుకోవాలి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన సైనిక స్థావరాలను అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి కాపాడుకోవాలి. ఇలాంటి చక్రబంధంలో చిక్కుకుంది చైనా.

అటు మంగోలియాకు, ఇటు దక్షిణ కొరియాకు బీజింగ్ చాలా దగ్గర. అంటే మంగోలియా ఎయిర్ బేస్ నుంచి మన వాయుసేన దాడులు మొదలుపెడితే పరిస్తితి ఘోరంగా ఉంటుంది. మోడీ వ్యూహానికి అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు సైతం బిత్తర పోయాయి. అందుకే చైనా అధ్యక్షుడు గ్జిన్ పింగ్ యుద్ధానికి జంకుతున్నాడు.

జపాన్ ఎందుకు మనకు మద్దతు ఇస్తోంది …

మొదటి నుంచీ మన దేశానికి జపాన్ అండగా నిలుస్తోంది. చైనాను ఎదిరించే విషయంలో మనతో కలిసి పని చేయడానికి రెడీగా ఉంది. ఇంతకీ జపాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి కారణం ఏంటి. ఇదే ఇప్పుడు అందరకి అంతు చిక్కని ప్రశ్నగా మారింది.భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ జపాన్ పాలకులతో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. పలు కీలక అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. 2014లో డోక్లాం విషయంలో చైనాకు ఎదురు నిలిచింది జపాన్. యుద్ధం అంటూ వస్తే మొదట తమను కొట్టిన తర్వాతే భారత్ జోలికి వెళ్లాలంటూ చైనాకు సవాల్ విసిరింది. అంతేకాదు, డోక్లాంలో చైనా ఎంటరైతే పశ్చిమ చైనా సముద్రంలోని చైనా సైనిక శిబిరాలపై దాడులు చేస్తామని ప్రకటించడంతో చైనా కంగుతింది. అయితే జపాన్ ఇంతగా చైనా మీద రెచ్చిపోడానికి చాలా కారణాలు ఉన్నాయి.

మొదటి నుంచీ చైనా తీరుపై మండిపడుతోంది జపాన్. ఇందుకు ప్రధాన కారణం తమ దేశానికి చెందిన దీవులను చైనా తనవిగా చెప్పుకోవడం జపాన్ కు ఏమాత్రం రుచించడం లేదు. ఇక ఈ ఏడాది మేలో సెన్కకు దీవుల్లోకి చైనా యుద్ధ విమానాలు చొరబడ్డాయి. వెంటనే జపాన్ కూడా తన యుద్ధ విమానాలతో చైనా వార్ క్రాఫ్ట్స్ వెంట పడింది. అయితే మొదటి సారిగా పేరులేని యుద్ధ విమానాలు వాడటంతో అంతర్జాతీయంగా చైనాను రచ్చకీడ్చ అవకాశం జపాన్ కు లేకుండా పోయింది.మరో ముఖ్యకారణం ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా వ్యాపారం పెరగడం జపాన్ కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అంతేకాదు, జపాన్ వ్యాపార నౌకలు ఇండోనేషియా, సింగపూర్, మలేషియా మీదగా పసిఫిక్ దేశాలకు వెళ్తాయి. ఈ మూడు దేశాలు ఇప్పుడు చైనాకు తొత్తుగా మారుతున్నాయి. దీంతో జపాన్ నౌకలకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో భారత నౌవికా దళం బలంగా ఉండటంతో జపాన్ నౌకలకు ఇబ్బంది లేకుండా పోతోంది. అంటే ప్రత్యక్షంగా జపాన్, మన నౌకా దళం సాయం పొందుతోంది. అందుకే మనం అడక్కపోయినా జపాన్ చైనాతో యుద్ధానికి కాలుదువ్వతోంది. కేవలం చైనా మీద మనం మొదటి తుపారీ గుండు వదిలిన మరుక్షణమే జపాన్ బాంబులు కురిపించేందుకు రెడీ ఉంది.

సీ.హెచ్. ఆనంద్ రామ్, సీనియర్ జర్నలిస్ట్