అమరావతి: ప్రభుత్వ సర్వీసులో చేరాలన్న వైద్యుల కల నెరవేరబోతోంది.
Education News
వైద్యవిద్య పూర్తి చేసిన వేలాదిమంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియామకాలు లేక, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువంటివారికి తాజాగా ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ఎంతో భరోసానిస్తోంది. వైద్యుల పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 19 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రజారోగ్యశాఖ, వైద్యవిధానపరిషత్, వైద్య విద్యా సంచాలకులు..ఈ విభాగాల్లోనూ శాశ్వత ప్రాతిపదికన 2,094 మంది వైద్యులను నియమించనున్నారు. నెల రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి వెంటనే వీరందరూ విధుల్లో చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక

  • దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
  • మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కాగా అమలు చేస్తారు.
  • గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వైద్యులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • పజారోగ్య శాఖ పరిధిలో 665 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ
  • బోధనాసుపత్రుల్లో 737 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ
  • వైద్యవిధానపరిషత్ ఆస్పత్రుల్లో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌ల నియామకం.