న్యూడిల్లీ : టెక్‌ దిగ్గజం ఆపిల్‌‌.. ఐఫోన్‌ 12 సిరీస్‌ డిజైన్‌లో పెను మార్పుకు శ్రీకారం చుట్టింది. మామూలుగా ఐఫోన్‌ 12 అంచులు గుండ్రంగా ఉండటం పరిపాటి. అయితే ఆ గుండ్రటి డిజైన్‌ స్థానంలో చదునైన అంచులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కొత్త డిజైన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త సిరీస్‌ ఫోన్‌కు సంబంధించిన క్యాడ్‌ స్కెచెస్‌, మౌల్డ్స్‌ నెట్టించ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే వాటి అంచులు చదునుగా ఉండటం మనం గుర్తించవచ్చు. ఈ కొత్త డిజైన్‌ ఐపాడ్‌ ప్రో డిజైన్‌కు దగ్గరగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు‌ చేస్తున్నారు.