రాష్ట్రం లో మంత్రి పదవి కోసం ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తునారు . ఈసారైనా మంత్రి పదవి వస్తుందని కొందరు సీనియర్స్ ఆశగా చూస్తున్నారు. సీనియర్స్ కీ ఇస్తారా? లేక బీసీ కోటా క్రింద ఇస్తారా ? అని ఎదురుచూస్తునారు. ఈ అవకాశం పోతే మరల 2024 వేచిచూడాలి. ఇప్పటికే ఆయా వర్గాలు వారు పావులు కలపటం మొదలు పెట్టారు. మంత్రులుగా బీసీ ఎమ్మెల్యేలకే దక్కుతుందా? లేక ఇతరులకు ఇస్తారా? జగన్ క్యాబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి..? మరెవరికి మంత్రి పదవులు ఊడతాయి అనే చర్చ మొదలయ్యింది.
ఎమ్మెల్యేలకీ పదవలు ఇచ్చినవారికి మంత్రి పదవి ఇస్తారా? లేక కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉందా ? పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేలగా గెలిచినవారికి ఇస్తారు ? లేక ఎమ్మెల్సీలను మంత్రులుగా తన క్యాబినెట్లో తీసుకుంటారా? ఇప్పట్లో కౌన్సిల్ రద్దు అయ్యే అవకాశం లేదు కాబట్టి మండలి నుంచే మంత్రిని తీసుకుంటారా.
రెండన్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ తొలుత చెప్పిన మాటలకు భిన్నంగా సాధ్యమైనంత త్వరగా కేబినెట్లోకి కొత్త ముఖాలను తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన తప్పదంటూ వస్తున్న సంకేతాలు అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. . తొలిమంత్రి వర్గ విస్తరణలో జగన్ అనేకమంది సీనియర్ నేతలను జగన్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల లెక్కలతో కొందరికీ తొలి విస్తరణలో చోటు దక్కలేదు. అయితే ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు చైర్మన్ హోదాలు కలిపించారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి, సీనియర్ నేతలు కొందరికి గతంలో అవకాశం ఇవ్వలేకపోవటం వల్ల.. ఈ సారి ఒకరిద్దరు సీనియర్ నేతలనైనా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, పశు సంవర్థకశాక మంత్రి మోపిదేవి వెంకటరమణ లను రాజ్యసభకు వెళ్లన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అవుతున్న వీరి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయాల్సిఉంది. అయితే వీరి స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకటి మైనార్టీలకు లభించే అవకాశం వుందని మరికొందరు అంటున్నారు. అయితే ఆ రెండు శాఖలతో పాటు, మరో రెండు స్థానాలను కూడా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… కొత్త మంత్రులకు స్వాగతం చెప్పటంతో పాటు కొందరు పాత మంత్రుల శాఖలను కూడా మారుస్తారని అంటున్నారు. ఏడాది పాలనలో చేసిన పని ప్రాతిపదికగా ఈ శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ విస్తృతంగా చేస్తూంటే మాత్రం కొత్తవారు, సీనియర్లతో కలిపి భారీ మార్పులు, చేర్పులు ఉంటాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో గుంటూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి, మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లా నుండి BC, SC, ST వర్గానికి ఇస్తే కొత్తగా గెలిచిన అంబటి రాంబాబు, విడదల రజిని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యేలకు ఆశాజనకంగా ఉంది. అనంతపురం జిల్లా నుండి ఎమ్మెల్యే అనంత వెంటకరామ రెడ్డి కీ ఇచ్చే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్కుమార్ (సతీష్), శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు లకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
Journalist:
– Parasuram, GeeTV