జీ టీవీ, అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6230కు చేరుకుంది. తాజాగా 17,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 82 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, నలుగురు మరణించారు.దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 96కు చేరింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 3065 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 3069 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.