‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ లోను సందీప్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నాడు సందీప్ వంగా. దీనికి సంబందించి వీరి మధ్య చర్చలు జరిగాయని.. వీరి కాంబినేషన్ లో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. కానీ టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ‘కబీర్ సింగ్’ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో సందీప్ వంగా ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవంట. దీంతో సందీప్ వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక కథ చెప్పాడన.. ఆ కథ ఆసక్తి కరంగా ఉండడం తో ప్రభాస్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారేనని తెలుస్తోంది.