వరుసగా భారీ చిత్రాల్ని తెరకెక్కించే దర్శకుడిగా మురుగదాస్ గురించి చెప్పాల్సిన పనే లేదు. పాన్ ఇండియా డైరెక్టర్ గా ఆయన అరుదైన గౌరవం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన డిజిటల్ మీడియాలోకి ప్రవేశించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొద్ది నెలల క్రితమే ఓ వెబ్-సిరీస్ ను ప్రారంభించారన్న సంగతి తెలిసింది తక్కువ మందికే. ఈ వెబ్-సిరీస్ షూటింగ్ కొన్ని నెలల క్రితం ప్రారంభమైంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్ లో వాణీ బోజన్ ప్రధాన పాత్రకు ఎంపికైందని తెలుస్తోంది. వాణీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గత సంవత్సరం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రంలో కథానాయికగా నటించింది. మీకు మాత్రమే చెప్తా అనేది ఈ సినిమా టైటిల్. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తరుణ్ సరసన నాయికగా వాణీ నటనకు పేరొచ్చింది. తాజాగా మురుగదాస్ వెబ్-సిరీస్ లో మహిళా ప్రధాన పాత్రలో అరుదైన ఛాన్స్ దక్కించుకుంది.